ETV Bharat / state

భవానీపురంలో పోలీస్​ పెట్రోలింగ్.. వాహనదారులకు కౌన్సెలింగ్ - భవానీపురంలో పెట్రోలింగ్.. వాహనదారులకు కౌన్సిలింగ్

విజయవాడ భవానీపురంలో పోలీసులు సాధారణ పెట్రోలింగ్ నిర్వహించారు. స్థానిక పున్నమి ఘాట్ సమీపంలో గంజాయి, మద్యం తాగుతున్న యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

patrolling at bhavanipuram ps region
భవానీపురంలో పెట్రోలింగ్.. వాహనదారులకు కౌన్సిలింగ్
author img

By

Published : Nov 25, 2020, 4:52 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్​ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి సీఐ మురళి కృష్ణ సాధారణ తనిఖీలు చేపట్టారు. కుమ్మరిపాలెం కూడలి నుంచి పున్నమి ఘాట్​ వరకు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. ఘాట్ సమీపంలో గంజాయి, మద్య సేవిస్తు జులాయిగా తిరుగుతున్న వాళ్లను పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.

అనంతరం ప్రధాన రహదారిపై మాస్కులు లేకుండా తిరుగుతున్న ద్విచక్రవాహనదారుకు కొవిడ్ జాగ్రత్తలు వివరించారు. వైరస్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగితే భారీ జరిమానా విధిస్తామని సీఐ మురళి కృష్ణ హెచ్చరించారు.

ఇదీచూడండి:

తమిళనాడులో హత్యచేశారు.. రామాపురంలో చిక్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.