కరోనా గురించి చిన్నారులకు అవగాహన లేదని... అందువల్ల అంగన్వాడీ కేంద్రాలకూ సెలవులు ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేస్తుంటే ఇంకా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వలేదని కృష్ణా జిల్లా పెద్దప్రోలులో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని చిన్నారుల ఇంటికే పంపాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి సెలవులు ఇవ్వాలని కోరారు.
ఇదీచూడండి. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత