ETV Bharat / state

పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఊతం - childrens education

కరోనా కారణంగా ఇంటివద్ద చదువుకుంటున్న పిల్లల్లో 64% మందికి కుటుంబసభ్యులు ఎవరో ఒకరి నుంచి చదువుకు సహకారం అందుతోంది. సర్కారు బడుల్లో చదివేవారిలో 60.2% మందికి ఇలా సహకారం అందుతుండగా.. ప్రైవేటులో చదివేవారికి 73.6% సాయం అందిస్తున్నారని సర్వే వెల్లడించింది. కరోనాతో బడులు తెరుచుకోకపోవడంతో ఇంటి వద్ద చదువుకునేందుకు ఎలాంటి వనరులున్నాయి ? కుటుంబసభ్యులు, ఇతరులు వారికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు ? అయా పాఠశాల నుంచి చదువుకునేందుకు ఎలాంటి విద్యా సామగ్రి అందుతోంది.. తదితర అంశాలపై ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ ‘విద్యా వార్షిక నివేదిక’ (ఆసర్‌-2020) పేరిట దేశ వ్యాప్తంగా గత సెప్టెంబరులో ఫోన్‌ ద్వారా సర్వే చేసింది. మొత్తం 1,18,838 మందిని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాట్సప్‌ ద్వారా 55.3%, ఫోన్‌ కాల్‌తో 45.5%, వ్యక్తిగతంగా కలవడం ద్వారా 30.2% మందికి పాఠ్యంశాలను చేరవేస్తున్నారు.

పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఊతం
పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఊతం
author img

By

Published : Oct 31, 2020, 6:20 AM IST

తల్లిదండ్రుల చదువు ప్రభావం పిల్లలపై..

తల్లిదండ్రుల విద్యాభ్యాసం వారి పిల్లలపైనా ప్రభావం చూపుతోంది. ఐదో తరగతిలోపు చదువుకున్న వారిలో 90% మంది తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపుతున్నట్లు సర్వే వెల్లడించింది. పదో తరగతి వరకు చదువుకున్న వారిలో 70%, పదిపైన చదువుకున్న వారిలో 56.5% మంది ఇలా పంపుతున్నారు. చదువుకున్న కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది.

1. ఐదో తరగతిలోపు చదువుకున్న తల్లిదండ్రులున్న విద్యార్థులు 26.8% ఉండగా వీరిలో 42.6% మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

2. తల్లిదండ్రుల అర్హత 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు 50% ఉండగా.. వీరిలో 65.4% మందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి.

3. ఉన్నతవిద్య చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు 23.2% ఉండగా వీరిలో 80.7% మందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి.

4. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో 57% మందికి స్మార్ట్‌ఫోన్లు ఉండగా.. ప్రైవేటులో 72.9% మందికి ఉన్నాయి.

5. టీవీలు మాత్రం 92.9% మందికి ఉన్నాయి.

పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఊతం
పిల్లల చదువులకు తల్లిదండ్రుల ఊతం

ఇవీ చూడండి : పోలవరం నిధుల్లో మరింత కోత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.