ఇదీ చదవండి:
'వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామ సచివాలయాలు పూర్తి చేస్తాం' - panchayathi raj engineer chief on sachivalyam
రాష్ట్రంలో 9,300 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణా రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామ సచివాలయాలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 30 కోట్లు నిధులు మంజూరయ్యాయని అన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద 454 చెక్ పోస్టులను పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
సచివాలయాలపై పంచాయితీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్
TAGGED:
latest news on sachivalayam