కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలు.. గోపాలపురంకు చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: