ETV Bharat / state

నిర్లక్ష్యానికి గురవుతున్న నూజివీడు కోట ద్వారాలు - కృష్ణా జిల్లా నూజివీడు కోట ద్వారాలు

చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన కృష్ణా జిల్లా నూజివీడు కోట ద్వారాలు... సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నూజివీడు కోటకు ఉన్న రెండు ద్వారాల్లో ఒకదాన్ని గుర్రాల గేటు అని... మరొకదాన్ని కుక్కల గేటు అని పిలుస్తారు. ఉత్తర, దక్షిణ గేట్లపై రాజుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోట ద్వారాలకు ఇరువైపులా ఉన్న రెండు గదులు పూర్తిగా శిథిలమయ్యాయి. వీటిని పరిరక్షించే దిశగా పురావస్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

nuziveedu-gates-latest-news
nuziveedu-gates-latest-news
author img

By

Published : Dec 18, 2019, 4:02 PM IST

నిర్లక్ష్యానికి గురవుతున్న కోట ద్వారాలు

.

నిర్లక్ష్యానికి గురవుతున్న కోట ద్వారాలు

.

Intro:ap_vja_19_17_nuzvidu_gets_pkg_ap10122
కృష్ణాజిల్లా నూజివీడు
యాంకర్ పార్ట్()
వందల ఏళ్లు గడిచినా చెక్కుచెదరని కోట ద్వారాలు అవి....... పదుల దశాబ్దాలు దాటినా ఇప్పటికీ పటిష్టంగా ఉన్న భవనాలు అవి తెల్లవారి పాలనకు ఎదురుతిరిగి స్వతంత్ర సమర శంఖం ఊదిన నూజివీడు కోట ద్వారాలు చరిత్రకు సాక్షాలు...... లుక్
వాయిస్ ఓవర్ వన్
పూర్వకాలం నాటి కోటలు చరిత్ర వైభవానికి శరణాలు రాజులు కార్యక్రమానికి ప్రతీకలు.... నూజివీడు కోటకు రెండు ద్వారాలున్నాయి ఒక ద్వారాన్ని గుర్రాల గేట్ అనే మరొక ద్వారాన్ని కుక్కలు గేటు అని పిలుస్తారు కనిపిస్తున్న వీరుని పేరు అప్పారావు అలియాస్ నూజివీడు రాజుల మూలపురుషుడు మేక బసవన్న తరువాత ఐదవ తరం వాడు అప్పట్లో రాజ్యాలకు అశ్వగంధ దళాలు ఉండేవి అప్పన్న మొదట అశ్విక దళానికి సేనాధిపతిగా ఉండేవాడు ఆ తర్వాత నూజివీడు రాజ్యానికి రాజు అయ్యాడు అశ్విక విద్య గుర్రపుస్వారీ లో విజయ అప్పారావు గోల్కొండ నవాబు దగ్గర ఉన్న పింకీ గుర్రాన్ని తన ప్రతిభతో లొంగదీసుకున్నాడు తన అశ్విక దళంతో ఎన్నో యుద్ధాలు చేసి గెలిచాడు ఆయన విజయాలకు గుర్తుగా ఉత్తర గేటు పై గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా విగ్రహాన్ని ప్రతిష్టించారు
బైట్స్ 1) రామ సూరి నూజివీడు వాసి
వాయిస్ ఓవర్ టు
దక్షిణ వైపు కనిపించేది కుక్కల గేటు గేటు పై ఇద్దరు రాజులు కనిపిస్తారు వీరితో పాటు వేట కుక్కలు కూడా ఉంటాయి ఇద్దరు రాజుల్లో ఒకరు జగన్నాధ అప్పారావు మరొకరు నారయ్య అప్పారావు వారి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు సోదరులకు వేట అంటే మక్కువ ఉండేదట వేట కుక్కలను వెంటపెట్టుకుని తరచు వేటకు వెళ్ళేవారు దీనికి గుర్తుగా కోట ద్వారం పై వేటకు వెళుతున్న దృశ్యాలను విగ్రహ రూపంలో ప్రతిష్టించారు
బైట్స్ ) రామ సూరి గారు
వాయిస్ ఓవర్ ట్రీ
నూజివీడు గడీలు ప్రస్తుతం విద్యాలయాలకు నిలయాలు కానీ కోట ద్వారాలు ఇరువైపులా రెండు గదులు మాత్రం పాడుబడ్డ గుహల మారిపోయాయి ఈ గదుల్లో ఒకప్పుడు శిస్తు వసూలు చేసే వారట ఇప్పుడు కనీసం లోపలికి వెళ్ళే వీలు కూడా లేదు సరిగ్గా పట్టించుకునేవారు లేక వెలవెలబోతున్నాయి చరిత్రను కాపాడుకునే దిశగా అధికారులు ప్రజలు అందరూ కలిసి రావాలని స్థానికులు కోరుతున్నారు
బైట్ ... రాజశేఖర్ నూజివీడు వాసి
ఎండ్ వాయిస్ ఓవర్
ప్రస్తుతం ఈ కోట అంతా పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకుంటున్న చరిత్ర కట్టడాలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు


Body:నూజివీడు కోట ముఖ ద్వారాల పై స్పెషల్ స్టోరీ


Conclusion:నూజివీడు ద్వారాల పై స్పెషల్ స్టోరీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.