ETV Bharat / state

చలువదనాల సబ్జా.. ఆరోగ్యానికి మంచి ఔషధంగా..!

వేసవి కాలంలో తగిలే ఎండ వేడిమి నుంచి సబ్జా గింజలు చక్కని ఉపశమనం అందిస్తాయి. ఫలూదాకి అదనపు రుచిని అందించే సబ్జాగింజల్లో పోషకాలూ అధికంగా ఉంటాయి.

Nutrients in substances nuts
వేడిమి నుంచి సబ్జాగింజలు చక్కని ఉపశమనం
author img

By

Published : Apr 29, 2020, 11:43 AM IST

బ్జాగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించి జీవక్రియలను వేగవంతం చేస్తాయి. పీచు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వీటిని తీసుకున్న వెంటనే పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు అదుపులో ఉంటుంది. పెరుగులో లేదా ఫ్రూట్‌సలాడ్‌లో వీటిని కలిపి తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.

వేడి తగ్గించడానికి..

నీటిలో కాసిన్ని సబ్జాగింజలు, కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఎండ వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్ఛు. ఈ గింజలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. నిమ్మకాయ నీళ్లు, షర్బత్‌, మిల్క్‌షేక్స్‌లో వీటిని కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయంపూట గ్లాసు వెచ్చటిపాలలో చెంచా నానబెట్టిన సబ్జాగింజలు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.

కడుపు ఉబ్బరానికి చెక్‌...

ఈ గింజలు శరీరంలోని వ్యర్థాలను సహజంగా బయటకు వెళ్లగొడతాయి. పేగుల కదలికలను ప్రేరేపించి మలబద్ధకాన్ని నివారిస్తాయి. కొన్నాళ్లపాటు రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు గ్లాసు గోరువెచ్చనిపాలలో కొన్ని సబ్జా గింజలు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే పొట్ట శుభ్రమవుతుంది. ఈ గింజల్లోని నూనెలు పేగుల్లోని వాయువులను బయటకు పంపి జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తాయి.

గుండెలో మంటను తగ్గించి...

సబ్జా గింజలు కడుపులో మంటను తగ్గిస్తాయి. వాటిలో ఉండే డైయూరేటిక్‌ సమ్మేళనాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని తటస్థపరిచి కడుపు మంటను తగ్గిస్తాయి.

ఒతైన జుట్టు కోసం...

ఈ గింజలను తరచూ తినడం వల్ల శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పుడుతుంది. సబ్జా విత్తనాల్లో ఇనుము, విటమిన్‌-కె, మాంసకృత్తులు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి దోహదపడతాయి. కప్పు కొబ్బరినూనెలో కొన్ని సబ్జాగింజలను నలిపి వేడిచేసి జుట్టుకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఇవీ చూడండి...

ఇమ్యునిటీ షాట్‌ కొట్టేద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.