కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక ఆసుపత్రిలో వ్యాక్సిన్ల కోసం తోపులాట జరిగింది. గన్నవరం మండలం ముస్తాబాద్ పీహెచ్సీ వద్ద టీకా తీసుకొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒకపక్క కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా.. ప్రజలు వ్యాక్సిన్ కోసం భౌతిక దూరం పాటించకుండా బారులు తీరారు. వైరస్ నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకుంటున్నా.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలి కదా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా రెండో దశలో యువత నిర్లక్ష్యమే అధికం: కలెక్టర్