కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్ సడలింపు ఆదేశాలు... కృష్ణా జిల్లాలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. విజయవాడ రెడ్‌జోన్‌లో ఉన్నందున.. ఎక్కడికక్కడ వ్యాపార కలాపాలు నిలిచిపోయాయి. మున్సిపల్ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమలకు కేంద్రం పచ్చజెండా ఊపినా... అవన్నీ నగరంలోని పరిశ్రమలకు అనుబంధంగా.. వాటి మీద ఆధారపడి ఉన్నందున ఎక్కడా తెరుచుకోలేదు. ప్రభుత్వం నుంచి విద్యుత్ ఛార్జీలు ఇతర మినహాయింపులు వస్తేనే... తిరిగి కోలుకోగలమని పరిశ్రమల ప్రతినిధులు అంటున్నారు.
ఇదీ చదవండి: సత్తెనపల్లి ఘటన దురదృష్టకరం: చంద్రబాబు