ETV Bharat / state

రైతన్నను నిండా ముంచిన నివర్ తుపాన్ - niver toofan latest news

నివర్ తుపాను రైతులను నట్టేట ముంచింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను నేలపాలు చేసింది. కోస్తా జిల్లాల్లో భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఆరబెట్టిన ధాన్యం మెలకలు వచ్చాయి. రైతులను పరామర్శించిన నాయకులు... నిండా మునిగిన కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతన్నను నిండా ముంచిన నివర్ తుపాన్
రైతన్నను నిండా ముంచిన నివర్ తుపాన్
author img

By

Published : Nov 29, 2020, 9:16 PM IST

Updated : Nov 29, 2020, 10:45 PM IST

నివర్‌ తుపాను రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కృష్ణా జిల్లాలో 4 రోజుల పాటు కురిసిన వర్షాలకు... 2లక్షల 38 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నందిగామ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, పెనమలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం పరిధిలో... వరి, మిరప, పసుపు, కంద, మినుము, పత్తి పంటలు పాడైయ్యాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అప్పులు తెచ్చి పంటలు పండిస్తే... చేతికొచ్చే సమయానికి తుపాను ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నీటమునిగిన పంటలను,... తెదేపా నేత మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ముదినేపల్లి మండలం దేవపూడి, వడాలి, వణుదుర్రులో గాలులకు నేలవాలిన వరిని... మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ చూశారు. నందిగామ ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను చూసిన తెదేపా నేత దేవినేని ఉమ.... తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరిలో దెబ్బతిన్న పంటను... తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. మాచర్ల పరిధిలోని ఒప్పిచర్ల, నరమాలపాడులో... స్థానిక నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు పర్యటించారు. పత్తి, వరి, మిరప పంటలను పరిశీలించారు.

రైతన్నను నిండా ముంచిన నివర్ తుపాన్

పశ్చిమగోదావరి జిల్లాలో..

వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో వరి దెబ్బతింది. పంటను పరిశీలించిన తెదేపా నేతలు జవహర్, పీతల సుజాత... ఎకరాకు 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉంగుటూరు మండలం నాచుగుంటలో పర్యటించిన తెదేపా నేతలు పట్టాభిరాం, గన్ని వీరాంజనేయులు... నీటమునిగిన పంటలను పరిశీలించారు. బొమ్మిడిలో మృతి చెందిన రైతు గొన్నూరి నాగబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులను వరద ముంచింది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురంలో పత్తి, వరి, బొప్పాయి పూర్తిగా దెబ్బతిన్నాయి. కిర్లంపూడి మండలంలో ధాన్యం రాశులు తడిసిపోయాయి. ముమ్మిడివరం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోనలో దెబ్బతిన్న వరిని... తెలుగుదేశం, జనసేన నాయకులు పరిశీలించారు. సామర్లకోట మండలంలో పంటలను చూసిన ఎమ్మెల్యే చినరాజప్ప... రైతులను ఆదుకోవాలని కోరారు.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా మాడుగుల, చీడికాడలో నివర్ తుపాన్ ప్రభావానికి 2 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేటలో తడిసిన పంటలను తెదేపా నాయకులు పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం

Last Updated : Nov 29, 2020, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.