మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వీలుగా కృష్ణా జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పోలీసుస్టేషన్లను ‘ఉమెన్ ఫ్రెండ్లీ’గా మార్చిన అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బందికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్టేషన్‌కు వచ్చే మహిళలను గౌరవంగా పలకరించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే మహిళలు తమ సమస్యలను అధికారులకు స్పష్టంగా వివరించేలా, ఫిర్యాదు స్వీకరించేందుకు మంచి వాతావరణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హెల్ప్‌డెస్క్‌ల ఆధునీకరణ
కమిషనరేట్ పరిధిలోని 22 పోలీసుస్టేషన్లలో అరకొర సదుపాయాలతో ఉన్న హెల్ప్‌డెస్క్‌లను ఆధునీకరిస్తున్నారు. గదిలోకి వెళ్లగానే ఆహ్లాదకరంగా ఉండేలా చక్కని రంగులు, చెక్కతో అందంగా తయారు చేసిన బల్ల, కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గదిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలికేలా నమస్తే అని రాశారు. హెల్ప్‌డెస్క్ బ్యాక్‌గ్రౌండ్‌లో దిశ సహాయకేంద్రం, పోలీసుశాఖకు చెందిన చిహ్నం, స్పందన కార్యక్రమానికి చెందిన చిత్రాలతో పాటు.. వచ్చిన వారికి భరోసా కల్పించేలా పెద్ద అక్షరాలతో ‘మీ రక్షణలో అహర్నిశలు’ అని రాసి ఉండే బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.దిశా చట్టంపై అవగాహన, బాధిత మహిళకు భరోసా కల్పించడం వంటివి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇప్పటికే ప్రారంభం...
అంతేకాక ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లలో పనులను ఇప్పటికే ప్రారంభించారు. పెనమలూరు, మాచవరం, నున్న, కంకిపాడు, సత్యనారాయణపురం, భవానీపురం, కృష్ణలంక తదితర స్టేషన్లలో దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా చోట్లా పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ వారం రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందులో భాగంగా ఒక్కో స్టేషన్‌కు రూ.లక్ష చొప్పున.. మొత్తం రూ.22 లక్షలకు ఖర్చు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పరిధిలో మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్‌ను ఆధునీకరించారు.
ఇదీ చదవండి: