ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్‌ను... తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై విశ్వాసం ఉంచి సీఎస్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. ప్రభుత్వ మార్గనిర్దేశం మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం జగన్ ఆయనకు అభినందనలు తెలియచేశారు. అంతకుముందు ఆదిత్యనాథ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
ఇదీ చదవండీ...రోజంతా కోర్టులోనే శాసనసభ కార్యదర్శి.. కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష...