కృష్ణా జిల్లా నందిగామలో తనపై దాడి చేశారంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్... ఇటీవల అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి నందిగామ సబ్ జైలులో ఉంచారు. వారిని మాజీమంత్రి నారా లోకేశ్ బుధవారం పరామర్శించారు. అయనతో పాటు మాజీమంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు, తంగిరాల సౌమ్య తదితరులు జైలుకు వచ్చారు.