మూర్ఖత్వానికి జగన్ మానవ రూపంగా మిగిలిపోయారంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. సీఎం మాస్క్ పెట్టుకోవడం లేదన్నారు. అది కాక.. వేరే వాళ్లు మాస్క్ పెట్టుకుంటే ఊరకోరని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్తో ఫొటో దిగేందుకు మాస్క్ పెట్టుకుని వచ్చిన వారిని.. మాస్క్ తీసేయాలంటూ జగన్ ఆదేశించిన ఓ వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. దళిత యువకుడి మృతికి మాస్క్ పెట్టుకోకపోవడమేనా.. మరేదైనా కారణం ఉందా.. అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: