కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో చౌకధరల దుకాణంలో రేషన్ పంపిణీ చేయకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రేషన్ డీలర్లపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు రేషన్ షాపుల వద్ద గుమిగూడి ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అందుచేత గ్రామాల్లో వాలంటీర్లే స్వయంగా బియ్యం, కందిపప్పు, పంచదారలను ప్యాక్ చేసి ప్రజల వద్దకే వెళ్లి అందజేయాలని ఆదేశించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ కోసం రెండో రోజూ ప్రజలు బారులుతీరారు. విజయవాడలోని యనమలకుదురు, రామలింగేశ్వరనగర్, చెల్లారావు రోడ్డు సహా పలు ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో రేషన్ బియ్యం, కందిపప్పు కోసం తరలివచ్చారు.
ఇదీ చూడండి 'రేషన్ సరకులు వాలంటీర్లతో ఇప్పించండి'