వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కృష్ణా జిల్లా రైతులకు కన్నీరు మిగిలింది. పోలంపల్లి ఆనకట్ట నుంచి కృష్ణా నదిలో కలిసే చందర్లపాడు మండలం వరకు అనేక గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల మండలాల పరిధిలోని ఏటిపట్టి గ్రామాల్లో పత్తి, వరి పంటలు సాగు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా మున్నేరులో 1.20 లక్షల క్యూసెక్కుల మేర చేరిన వరద.. ఆయా పొలాలను ముంచెత్తింది. వారం పాటు పత్తి, వరి పంటలు నీటిలో ఉండటంతో పూర్తిగా నాశనం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు సైతం దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: