మున్సిపాలిటీలు, నగరపంచాయితీల్లో కౌన్సిల్ సభ్యుల సంఖ్యను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లో ఈ ఆదేశాలు వర్తింపజేసేలా ఉత్తర్వులు వెలువరించారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం 2004లో జారీ చేసిన నిబంధనల మేరకు కౌన్సిల్ సభ్యుల సంఖ్య లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పురపాలికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య నిబంధనల మేరకు లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు భావించిన పురపాలక శాఖ వాటిని 2004 నిబంధనల మేరకు నిర్దేశిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గలో 27 మందికి, విశాఖ నర్సీపట్నంలో 28, యలమంచిలిలో 25 మందికి, విజయనగరం బొబ్బిలిలో 31 తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 31, రామచంద్రాపురం-28, మండపేట-30, పెద్దాపురం 29, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 30, నూజివీడు-32, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో-31, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 35, కర్నూలు జిల్లా యెమ్మిగనూరు-34, అనంతపురం జిల్లా గుత్తి 25, కల్యాణదుర్గం 24, రాయదుర్గం 32, వైఎస్ఆర్ కడప జిల్లాలో పొద్దుటూరు 41, మైదుకూరు 24, చిత్తూరు జిల్లా పలమనేరు 26, నగరి 29, పుత్తూరు 27 మంది ఉండేలా కౌన్సిల్ సంఖ్య ను నిర్దేశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సభ్యుల సంఖ్య నిర్దేశం
రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సభ్యుల సంఖ్యను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.నెల్లూరు, పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లోని పలు పురపాలికల్లో సభ్యుల సంఖ్యను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపాలిటీలు, నగరపంచాయితీల్లో కౌన్సిల్ సభ్యుల సంఖ్యను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాలిటీల్లో ఈ ఆదేశాలు వర్తింపజేసేలా ఉత్తర్వులు వెలువరించారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం 2004లో జారీ చేసిన నిబంధనల మేరకు కౌన్సిల్ సభ్యుల సంఖ్య లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పురపాలికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య నిబంధనల మేరకు లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు భావించిన పురపాలక శాఖ వాటిని 2004 నిబంధనల మేరకు నిర్దేశిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గలో 27 మందికి, విశాఖ నర్సీపట్నంలో 28, యలమంచిలిలో 25 మందికి, విజయనగరం బొబ్బిలిలో 31 తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 31, రామచంద్రాపురం-28, మండపేట-30, పెద్దాపురం 29, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 30, నూజివీడు-32, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో-31, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 35, కర్నూలు జిల్లా యెమ్మిగనూరు-34, అనంతపురం జిల్లా గుత్తి 25, కల్యాణదుర్గం 24, రాయదుర్గం 32, వైఎస్ఆర్ కడప జిల్లాలో పొద్దుటూరు 41, మైదుకూరు 24, చిత్తూరు జిల్లా పలమనేరు 26, నగరి 29, పుత్తూరు 27 మంది ఉండేలా కౌన్సిల్ సంఖ్య ను నిర్దేశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
AP_VJA_04_19_council_members_fixed_for_ULBs_PKG_3052784
Conclusion: