విజయవాడ నగరంలోని అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ప్రకటన బోర్డులు, బ్యానర్లు, పోస్టర్లను పూర్తిగా తొలగించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెచ్చరించింది. అందుకు బాధ్యుల నుంచి భారీగా అపరాధ రుసుము విధించి, వసూలు చేస్తామని పట్టణ ప్రణాళికాధికారి లక్ష్మణరావు తెలిపారు.
పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలిపోయి ప్రాణనష్టానికి తోడు.. ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. నగర పాలక సంస్థ సెక్షన్ సీఆర్ 134 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండుగల శుభాకాంక్షలు, రాజకీయ నాయకులు, వ్యక్తిగత అభినందనలు అంటూ విచ్ఛలవిడిగా బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి నగర సుందరీకరణను దెబ్బతీస్తే... అందుకు ఏజెన్సీలు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: