వ్యవసాయ విస్తరణ అధికారులను ( ఎంపీఈవో) గ్రామ సచివాలయంలోకి నేరుగా తీసుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో అధికారులు విజ్ఞాపన దీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శ రామకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ పథకాలను రైతులకు దగ్గర చేస్తూ విధులు నిర్వహిస్తున్న ఎంపీఈవోలను గ్రామ సచివాలయంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి