కృష్ణా జిల్లా మోపిదేవిలోని బీసీ బాలుర గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అనంతరం అవనిగడ్డలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించి.. సౌకర్యాలు, ఆక్సిజన్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అందరూ వాక్సిన్ వేయించుకోవాలని ఎంపీ సూచించారు. త్వరలో అవనిగడ్డలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని వివరించారు. యువత మాకేమీ కాదని నిర్లక్ష్యంతో ఉంటున్నారని, రెండు మాస్కులు ధరించాలని సూచించారు.
ఇదీ చదవండీ... 'ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడులకు దిగుతున్నారు'