ETV Bharat / state

vijayasai letter to pm: నక్సల్స్​కి సంబంధం లేదు.. వారు వచ్చి ట్రాక్‌ను దెబ్బతీయటం సాధ్యం కాదు!

author img

By

Published : Jul 21, 2021, 10:38 AM IST

హిరాఖుడ్ రైలు ప్రమాదంపై విచారణ విషయమై ప్రధాని మోదీకీ ..ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. "విచారణను తప్పుదారి పట్టించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి" అని ఆయన కోరారు. ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని ఆరోపించారు.

mp vijayasaireddy letter to pm narendra modi on hirakhud rail  accident
ప్రధానికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
mp vijayasaireddy letter to pm narendra modi on hirakhud rail  accident
మోదీకీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

హిరాఖుడ్ రైలు ప్రమాదం విచారణను మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. 2017 జనవరి 21వ తేదీ అర్థరాత్రి కునేరు రైల్వేస్టేషన్ యార్డు వద్ద పట్టాలు తప్పిన హిరాఖుడ్ ఎక్స్​ప్రెస్‌ ప్రమాదంపై జరిగిన విచారణను.. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అత్యున్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించి... దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరారు.

ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారని, 70 మందికి పైగా గాయాలపాలయ్యారని ప్రధానికి లేఖలో వివరించారు. ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని... అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సీబీసీఐడీ విచారణను కూడా నాటి డివిజినల్ రైల్వే మేనేజర్ తప్పుదారి పట్టించారని లేఖలో ప్రస్తావించారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని విజయసాయి అన్నారు. బీవీవీ రాజు, వాల్తేరు ప్రొటోకాల్ ఆఫీసర్ సీహెచ్ విష్ణుమూర్తిల ద్వారా రూ. లక్షల రూపాయలు ఖర్చు చేసి విచారణను మేనేజ్ చేయించారని మండిపడ్డారు.

ప్రమాదం జరిగినట్లు అందరినీ నమ్మించారు!

ప్రమాదం జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామునే కొందరు కాంట్రాక్టు కార్మికులను తీసుకెళ్లి రైలు పట్టాల దగ్గర మార్పులు చేసి... ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని పేర్కొన్నారు. నక్సల్స్ ట్రాక్​ను ధ్వంసం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అందరినీ నమ్మించారని.. ఆరోపించారు. వాస్తవానికి ప్రమాదం రైల్వే స్టేషన్ యార్డులో, ఆపరేటింగ్ క్యాబిన్ సమీపంలో జరిగిందని గుర్తు చేశారు. కానీ.. ఈ ప్రమాదానికీ, నక్సల్స్​కు ఎలాంటి సంబంధం లేదని రాయగఢ్ ఎస్పీ, ఒడిశా డీజీపీలు స్పష్టం చేశారన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిరంతరాయంగా కాపలా , రైల్వే స్టాఫ్ కూడా తిరుగుతుంటారని.. అలాంటి చోటుకు నక్సల్స్ వచ్చి ట్రాక్‌ను దెబ్బతీయటం సాధ్యం కాదని చెప్పారన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు సైతం.. ఈ ప్రమాదానికీ, నక్సల్స్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారన్నారు.

విచారణను ప్రభావితం చేశారు..!

కమిషనర్, రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) ద్వారా జరిగిన విచారణను నాటి కేంద్ర మంత్రి అశోక్ ప్రభావితం చేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా ఎన్ఐఏ నుంచి ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా గిరిజనులు, పేద ప్రజలేనని, ప్రమాదానికి కారకులైన వారిని వదిలేస్తే మృతుల ఆత్మలకు శాంతి ఉండదన్నారు. ఎన్ఐఏ నివేదికను విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టేలా అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, వాస్తవాలను వెలికితీసి, బాధ్యులను శిక్షించాలని ప్రధానమంత్రిని విజయసాయి రెడ్డి కోరారు.

ఇదీ చూడండి:

'మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.