ETV Bharat / state

పోలవరం రాష్ట్రానికి జీవనాడి: సుజనా

ప్రభుత్వానికి తొందరపాటు నిర్ణయాలు పనికిరావని భాజపా ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

సుజనా చౌదరి
author img

By

Published : Aug 22, 2019, 11:53 PM IST

పోలవరం రాష్ట్రానికి జీవనాడి వంటిది

పోలవరం జలాశయం.. రాష్ట్రానికి జీవనాడి వంటిదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్​పై ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని హితవు పలికారు. తొందరపాటు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందని జగన్​ గ్రహించాలన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరంపై కేంద్రం, ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జపాన్​ ప్రభుత్వం కూడా ప్రభుత్వ చర్యలు అభివృద్ధికి దోహదపడదని లేఖ రాసిందని వెల్లడించారు. వ్యక్తిగత పంతాలకు పోకుండా పోలవరం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి

పోలవరంను న్యాయపరంగానే ఎదుర్కొంటాం:మంత్రి కొడాలి నాని

Intro:టీడీపీ కార్యకర్త పాడె మోసి రుణం తీర్చుకున్న
జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని.. !Body:Ap_tpt_36_22_tdp_jilla_adyakshudi_nivaali_ava_ap10100

"నాని అన్న అంటే నాకెంతో ఇష్టం.. ఆయనే నా ప్రాణం.. నా రాజకీయ జీవితం ఆయనకే అంకితం. " అంటూ గత ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఒక టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. తన కోసం అహర్నిశలు పరితపించిన ఆ యువ నాయకుని పాడె మోసిన జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని ఒక రకంగా రుణం తీర్చుకున్నాడు. ముందుగా ఓం ప్రకాష్ నాయుడు భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు పులివర్తి నాని. అలాగే గత ఎన్నికల సమయంలో అనునిత్యం తనతో పాటుగా నడచిన యువ నాయకులు ఓం ప్రకాష్ నాయుడు లేని లోటు పార్టీకి తీరనిదని పులివర్తి వినీల్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతికుండగా ఓం ప్రకాష్ నాయుడు తెలుగు దేశం పార్టీకి చేసిన సేవలను ఇరువురు గుర్తు చేసుకున్నారు. అనంతరం పులివర్తి నాని ఆయన కుమారుడు పులివర్తి వినీల్ తో కలసి ఓం ప్రకాష్ నాయుడు పార్థివ దేహాన్ని (పాడె) ఇంటి నుంచి స్మశానం వరకు మోశారు. తనను ఎంతగానో అభిమానించిన యువ నాయకుని పార్థివ దేహాన్ని భుజంపై మోసి రుణం తీర్చుకున్నారు. అతి చిన్న వయసులో అకాల మరణం చెందిన ఓంప్రకాష్ నాయుడు కుటుంబానికి అండగా వుంటామని హామీ ఇచ్చారు.
*జన సంద్రమైన కల్ రోడ్డు పల్లి...*
చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లికి చెందిన ఓం ప్రకాష్ నాయుడు, శంకర్ నాయుడులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇరువురు ఒకే గ్రామానికి చెందటం, ఓం ప్రకాష్ నాయుడు అవ్వ గోవిందమ్మ కర్మ క్రియలకు అవసరమైన సరుకులు తీసుకుని వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు వ్యక్తులు టీడీపీ కి చెందిన వారు కావటంతో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.