ETV Bharat / state

MP RRR LETTER TO CM: నిధులు దారి మళ్లిస్తే ఉత్పాతమే

సీఎం జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు.ప్రభుత్వం సుమారు రూ.41 వేల కోట్లకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని కొంతమంది ఆరోపిస్తున్నారని..వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

mp raghuram letter to cm on department of finance fund misuse
సీఎం జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
author img

By

Published : Jul 11, 2021, 8:02 AM IST

రాష్ట్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తే పెను ఉత్పాతానికి దారి తీస్తుందని, తక్షణమే లోటుపాట్లను సరిదిద్దాలని సీఎం జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.41 వేల కోట్లకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని మీడియా, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.41,043.08 కోట్లకు సంబంధించిన 10,806 బిల్లులను ప్రత్యేక కేటగిరీ బిల్లులుగా పేర్కొంటూ ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా డ్రా చేశారని ముఖ్య అకౌంటెంట్‌ జనరల్‌ లతా మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌కు లేఖ రాశారు. ఎలాంటి వోచర్లు, మంజూరు పత్రాలు, తీసుకున్నవారి వివరాలు, డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారి సంతకాలు లేకుండా తీసుకున్నందున వీటన్నింటినీ అనుమానాస్పద బిల్లులుగానే పరిగణించాల్సి ఉంటుంది.

ఇంత పెద్ద మొత్తంలో నిధులకు లెక్కలు చూపకపోవడం పొరపాటున జరిగింది కాదు. దీనిపై స్పష్టమైన వివరాలతో, బాధ్యతాయుతమైన సమాధానం చెప్పడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ముందుకు రావాలి. సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) విషయాన్ని పక్కన పెడితే ఈ చెల్లింపులు ఎవరికి చేశారు? ఎందుకు చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. సీఎఫ్‌ఎంఎస్‌ సక్రమంగా పని చేయడం లేదంటూ.. ఉపాధి హామీ కింద పనులు చేసిన అతి చిన్న గుత్తేదారులకు కూడా బిల్లులు ఆపేసిన మీరు, అదే వ్యవస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం అనుమానాలకు తావిస్తోంది’ అని ఎంపీ లేఖలో పేర్కొన్నారు.

ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ లేఖ

‘ట్రెజరీ తనిఖీ కోసం మా బృందం ఈ ఏడాది మార్చి 22 నుంచి 26 వరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, దాని పరిధిలోని వివిధ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించింది. 10,806 బిల్లులకు సంబంధించి రూ.41,043.08 కోట్లను ట్రెజరీ కోడ్‌ నిబంధనలను పాటించకుండా స్పెషల్‌ బిల్లుల కేటగిరీలో డ్రా చేసినట్టు గుర్తించింది. అవి దేనికి ఖర్చు చేశారన్న వర్గీకరణ, డీడీఓ, లబ్ధిదారుల వివరాలు, మంజూరు, ప్రొసీడింగ్స్‌ వివరాలు, సబ్‌వోచర్లు వంటివేమీ లేవు. వివిధ ఖజానా కార్యాలయాల పరిధిలో 8,614 స్పెషల్‌ బిల్లుల కింద రూ.224.28 కోట్లు చెల్లించారు, మరో 2,164 బిల్లులకు సంబంధించి రూ.40818.79 కోట్లు స్పెషల్‌ బిల్లుల కింద సర్దుబాటు చేశారు. ఆ బిల్లులన్నీ ట్రెజరీల ద్వారా రాలేదు. నిజానికి ట్రెజరీ అధికారుల సంతకంతోనే అవి జరగాలి. ఈ లోపాల్ని సరిదిద్దడానికి చర్యలు చేపట్టండి’ అని రావత్‌కి రాసిన లేఖలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఆ లేఖను కేశవ్‌ మీడియాకు విడుదల చేశారు.

ఇదీ చూడండి. DWIVEDI: 'లేటరైట్ తవ్వకాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.