ROAD ACCIDENT IN CHITTOOR DISTRICT: ఫ్రెండ్స్‌తో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఆ యువకుడు మార్గమధ్యలోనే విగతజీవిగా మారాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామకు చెందిన నలుగురు స్నేహితులు కూర్గ్ ట్రిప్ వెళ్తుండగా మార్గమధ్యలో నందిగామకు చెందిన హర్ష (19) అనే యువకుడు చెందాడు. రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
గంగవరం సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, స్పోర్ట్స్ బైక్‌లపై విహారయాత్రకు స్నేహితుల బృందం బయలుదేరింది. బెంగుళూరు చెన్నై జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆటోను వేగంగా వచ్చి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నందిగామ వాసవి మార్కెట్‌కు చెందిన తాటి హర్ష వెంకట వరుణ్ మృతి చెందాడని తెలిపారు. మృతుడు వెటర్నరీ ట్రైనింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
"నలుగురు వ్యక్తులు విజయవాడ నుంచి కూర్గ్‌కి వెళ్తున్నారు. అందులో హర్ష అనే వ్యక్తి వేగంగా వస్తున్నాడు. అదే సమయంలో ఆటో రావడంతో సైన్ బోర్డుని ఢీకొట్టాడు. దీంతో హెల్మెట్ కూడా పగిలిపోయింది. దీనిపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాము"- ప్రసాద్, గంగవరం సీఐ
బైక్ చక్రంలో చిక్కిన చీరకొంగు - కిందపడి మహిళ మృతి
ROAD ACCIDENT IN KRISHNA DISTRICT: అదే విధంగా కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై సైతం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ వైపునకు వస్తున్న స్పోర్ట్స్ బైక్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న కొంతేటి మణికంఠ(26) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మణికంఠ.. ఆత్మహత్య చేసుకున్న విజయవాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న స్నేహితుడిని పరామర్శించేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఆత్కూరు పోలీసులు.. మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.