ప్రభుత్వానికి భూములు పంచాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే.. తమ వైఫల్యాలను న్యాయస్థానాలపై వేసి తప్పించుకుంటోందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. న్యాయస్థానాలను రాజకీయాల్లోకిలాగాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కోర్టులు ఎవరికి పడితే వారికి ఊరికే స్టేలు ఇవ్వవని కనకమేడల స్పష్టం చేశారు. కావాలనే ప్రభుత్వం తన పార్టీవారితో కేసులేయిస్తూ.. న్యాయస్థానాలను, ప్రతిపక్షాలను తప్పుపడుతోందని ఆరోపించారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు.
పేదలకు ఇళ్లస్థలాలకు వీలుకాని భూములను ఎంచుకొని, ప్రతిపక్షాలపై బురదచల్లుతూ.. వైకాపానేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. కొడాలి నాని అమరావతిలో రాజధాని వద్దని చెప్పడం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. హైకోర్టు తరలింపు, మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో స్టే ఉంటే.. కేబినెట్ మంత్రి అలా న్యాయస్థానాలను కించపరిచేలా మాట్లాడటమేంటని కనకమేడల రవీంద్రకుమార్ నిలదీశారు.
ఇదీ చదవండి: