ETV Bharat / state

లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ - అమ్మవారి సేవలో సినీప్రముఖులు - Dasara Navaratri 2024 - DASARA NAVARATRI 2024

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

Vijayawada Dasara Navaratri Utsavalu
Vijayawada Dasara Navaratri Utsavalu (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2024, 10:09 PM IST

Dasara celebrations in Vijayawada 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ప్రారంభమైన రద్దీ ఏ సమయంలోనూ తగ్గుముఖం పట్టలేదు.

ఉచిత దర్శనాలు, వంద, మూడు వందల రూపాయల దర్శనాలతో సమానంగా ఐదు వందల రూపాయల దర్శనాలు, వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలు కొనసాగడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దీంతో స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ సృజన, విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు, ఈవో రామారావు దగ్గరుండి రూ.500ల టికెట్​ కొనుగోలు చేసిన భక్తులను ముందుకు నడిపించాల్సి వచ్చింది. ఇందుకోసం అదనపు సిబ్బంది సేవలను కూడా వినియోగించారు. మరోవైపు క్యూలైన్లలో నుంచుని లలితా సహస్రనామ పారాయణాన్ని పఠిస్తూ భక్తులు అమ్మవారి సన్నిధిని చేరుకున్నారు. కోటిసూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించిన జగన్మాత భక్తులను కటాక్షించారు.

Devotees Rush in Indrakeeladri : మరోవైపు దుర్గమ్మ దర్శనానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నిర్మాత దిల్​రాజు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. భక్తులను చల్లగా అనుగ్రహించే జగన్మాత సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బాలీవుడ్‌ సినీనటి కాదంబరీ జెత్వానీ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని కాదంబరీ జెత్వానీ తెలిపారు. జగన్మాత అనుగ్రహంతో ప్రజలందరి కష్టాలు తీరి అంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందన్నారు. ఇతర ఆలయాలు కూడా ఉత్సవాల సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాదంబరీ జెత్వానీ ఆకాంక్షించారు. మరోవైపు గత మూడు రోజులూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ కొంత వేడి తగ్గనా ఉక్కపోత అధికంగా ఉండడంతో భక్తులు అవస్థలు పడ్డారు. సాయంత్రానికి చిరుజల్లులు కురవడంతో కాస్త ఉపశమనం లభించింది.

మా అమ్మ బంగారం - ఏ అలంకారానికి ఏ ఆభరణమో తెలుసా? - Vijayawada Durga Devi Ornaments

ఇంద్రకీలాద్రి పేరెలా వచ్చింది? విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర మీకోసం! - Dussehra 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.