కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో కన్నతల్లి ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తన చిన్న కొడుకును ఎలాగైనా చంపాలనుకుంది ఉషా. ప్రియుడు శ్రీనుతో కలిసి పథకం రచించింది. రెండు రోజుల క్రితం కుమారుడిని చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణలోని కోదాడ వద్ద ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని పూడ్చిపెట్టారు.
అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కన్న తల్లిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు నిజం బయటపెట్టారు. జగ్గయ్యపేట పోలీసులు తల్లి ఉషాను, ప్రియుడు శ్రీను అరెస్ట్ చేశారు. ఉషా రెండు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటుంది.
ఇదీ చదవండి: