ఇంటి పైనుంచి తల్లీబిడ్డ జారిపడిన సంఘటన గన్నవరం పట్టణంలో మంగళవారం జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన చిమాటా వసంతలక్ష్మి కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా గన్నవరంలో స్థిరపడ్డారు. ఐదేళ్ల క్రితం వివాహమైన వసంతలక్ష్మి తన ఇద్దరు ఆడపిల్లలు, భర్తతో కలిసి గన్నవరంలోనే నివసిస్తోంది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టాలంటూ కొంతకాలం నుంచి మనస్తాపంతో బాధపడుతున్న ఆమె మానసిక పరిస్థితి దిగజారింది. వైద్యుల సలహా మేరకు ఆమె చికిత్స తీసుకుంటోంది.
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో అందరూ ఉండగానే నాలుగేళ్లున్న తన పెద్ద కూతురు భానును తీసుకుని ఇంటి పైకి వెళ్లింది. ఈ క్రమంలో చేతిలో నుంచి ముందుగా కూతరు, అనంతరం మరో కుమార్తెను పట్టుకొనే క్రమంలో.. వసంతలక్ష్మి జారి కిందపడింది. చిన్నారి భాను పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ముందు విజయవాడ, అనంతరం, గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసంతలక్ష్మికి కూడా తీవ్ర గాయాలైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: