ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యం దక్కింది. ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి అంశాన్ని ప్రస్తావించటంతో పాటు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, పొరుగసేవల సిబ్బంది సంక్షేమ కోసం చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఆశా వర్కర్లకు వేతనాలు 10వేలకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతం 400 నుంచి 4వేలకు, పురపాలక పాఠశాలల్లో పొరుగుసేవల క్రింద పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు 12వేల నుంచి 18వేల రూపాయలకు, సెర్ప్ లో పనిచేసే రీసోర్స్ పర్సన్లకు 5వేల నుంచి 10వేలకు, హోంగార్డుల వేతనం 18వేల నుంచి 21వేలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వెయ్యి నుంచి 3వేల రూపాయలకు, అంగన్వాడీ వర్కర్లకు 10వేల 500 నుంచి 11వేల 500, అంగన్వాడీ హెల్పర్లకు 6వేల నుంచి 7వేల రూపాయలకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలతే మొత్తం 3 లక్షల 17వేల మందికి ఉద్యోగులకు లబ్ధి జరగనుంది.
ఇది కూడా చదవండి