కృష్ణాజిల్లా దివిసీమలో వానరాలకు ఆహారం లేక విలవిల లాడుతున్నాయి. లాక్ డౌన్ వలన ప్రజలు ఇంటి దగ్గరే ఉండటంతో కోతులను గ్రామంలోకి రాకుండా చేస్తున్నారు. అవనిగడ్డ మండలం, రామచంద్రాపురం, వెకనూరు గ్రామ శివారులో వందల వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కొందరు జంతు ప్రేమికులు వాటికి బొప్పాయి, కొబ్బరి, అరటి కాయలు వేసి వాటి ఆకలి తిరుస్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వానరాలు వెళుతున్నాయి. మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామంలో వందల కోతులు ఆహారం లేక అలమటిస్తున్నాయి.
ఇదీ చూడండి సాధారణ పరిస్థితికి వేగంగా చర్యలు : డీజీపీ