ఇదీ జరిగింది
విజయవాడ మాచవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతని చరవాణికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. దిల్లీ సైబర్ క్రైం పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మీ నంబరు నుంచి పలువురి మహిళలను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని మీ చిరునామా చెప్పండంటూ దబాయించారు. భయపడిన బాధితుడు తనకు ఏమీ తెలియదని చెబుతుండగా.. వారికి కావాల్సిన వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. నంబరును ఎవరో క్లోనింగ్ చేసి వినియోగిస్తున్నారని.. దీన్ని అడ్డుకోవాలంటే మేం చెప్పినట్లు చేయాలంటూ నమ్మించారు. నంబరును ఆండ్రాయిడ్ ఫోన్లో వేయమని చెప్పి నకిలీ యాప్, కాంటాక్ట్లు ఇచ్చి ఇన్స్టాల్ చేయమని సూచించారు. సేవ్ చేసుకున్న చరవాణి నంబర్లను బ్లాక్ చేసుకుంటే ఇబ్బందులుండవని చెప్పారు. కేవలం గంట సమయంలోనే చాకచక్యంగా తతంగాన్ని నడిపి నగదు దోచేశారు.
ఇదీ చూడండి: