వెంకన్న సాక్షిగా మోదీ మోసం చేశారు - బొప్పరాజు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణానికీ నిధులు ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్షకు ఉద్యోగులు బయల్దేరి వస్తుంటే రైళ్లలో వసతులు లేకుండా చేశారని ఆరోపించారు.