ఈ నెల 12న జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పొయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లలంకలో అగ్ని ప్రమాదానికి గురై సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 వేలతో పాటు నిత్యావసర సరకులు, వంట సామగ్రి, నూతన దుస్తులు అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని.. అధైర్య పడవద్దని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో అగ్ని ప్రమాదం... మూడు ఇళ్లు దగ్ధం