ETV Bharat / state

తప్పిపోయిన పదేళ్లకు కుమారుడి చెంతకు చేరిన తల్లి - కృష్ణా జిల్లాలో తప్పిపోయిన మహిళా న్యూస్

కృష్ణా జిల్లా నందిగామ చందాపురంకు చెందిన ఓ మహిళ పదేళ్ల క్రితం తప్పిపోయింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో... భాష తెలియని ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించాడో ఏమో కానీ పదేళ్ల తర్వాత ఆమె తన కుమారుడి చెంతకు చేరింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-December-2019/5342993_702_5342993_1576077525092.png
missing mother reached son after ten years in krishna district
author img

By

Published : Dec 11, 2019, 9:16 PM IST

తప్పిపోయిన పదేళ్ల తర్వాత కుమారుడి చెంతకు చేరిన తల్లి

కృష్ణా జిల్లా నందిగామ చందాపురానికి చెందిన ఉన్నం సైదులు తల్లి పదేళ్ల క్రితం తప్పిపోయింది. విజయవాడ నుంచి తప్పిపోయిన సుబ్బలక్ష్మి గుజరాత్​లో పదేళ్ల పాటు జీవనం సాగించింది. రైల్వేస్టేషన్​లో ఉన్న ఆమెను అహ్మదాబాద్ పోలీసులు రహెనేకి సువిథా అనే ఆశ్రమంలో చేర్చారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ అనే తెలుగు వ్యక్తి గుజరాత్ వెళ్లిన సందర్భంలో సుబ్బలక్ష్మి తెలుగు మాట్లాడటం గమనించి... కృష్ణా జిల్లా ఎస్పీకి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రవీంద్రబాబు నందిగామ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రత్యేక టీమ్​ను గుజరాత్​కు పంపించి సుబ్బలక్ష్మిని నందిగామకు తీసుకొచ్చి కుమారుడికి అప్పగించారు. పదేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నందుకు కుమారుడు ఆనందం వ్యక్తం చేశాడు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదీ చూడండి: ''నా కొడుకుని చంపినవాళ్లని శిక్షించండి సారూ..!''

Intro:Body:

ap_vja_53_11_missing_mother_reached_son_av_kakani_venkateswararao_1112digital_1576067580_1030

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.