రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం అగ్రహారంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, అధికారులు పాల్గొన్నారు.
సువిశాలమైన స్థలంలో.. జిల్లాలో దాదాపు 16 వేల మందికి ఇళ్లు నిర్మించి సకల సౌకర్యాలతో నూతన నగరాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేలాది మందికి గృహ యోగం కల్పించే ఈ అవకాశం తన రాజకీయ జీవితంలో సువర్ణ ఘట్టమన్నారు.
ఇదీ చదవండి: