Jogi Ramesh Followers Attack: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీస్స్టేషన్లో పోలీసుల ముందే జనసేన కార్యకర్తలపై దాడికి దిగారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఆపకుండా చోద్యం చూశారని జనసేన నాయకులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ.. స్పందించి చర్యలు తీసుకోవాలని జనసేన నేత యడ్లపల్లి రామ్‌సుధీర్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని అడిగినందుకు జనసేన నేత యడ్లపల్లి రామ్సుధీర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని రామ్ సుధీర్ విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఎవరో పోస్టర్లు అంటిస్తే.. అవి జనసేన నాయకులు అంటించారని కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. రక్షించాల్సిన పోలీసులే చట్ట విరుద్ధంగా ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగటం తప్పా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రామ్‌సుధీర్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: