రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలైనా …. ఒక్క పాఠశాల కూడా మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని..... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నామన్న ఆయన.... ఈ విప్లవాత్మక సంస్కరణలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. క్రీడా మైదానాలు లేని పాఠశాలలు గుర్తించి భూములు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా స్పోర్ట్స్ కిట్లు అందిస్తామన్నారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నాణ్యమైన విద్య, బోధన, మౌలిక సదుపాయల కల్పనకు...... జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 5+3+3+4 విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉపాధ్యా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి