కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని వలస కూలీలలు.. తమను సొంత రాష్ట్రానికి పంపాలంటూ ఝార్ఖండ్ కు చెందిన వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని ఎమ్మెల్సీ కర్మాగారంలో.. ఎల్ అండ్ టీ ద్వారా జరిగే నిర్మాణ పనులను చేపడుతున్న వారంతా.. నిరసన వ్యక్తం చేశారు.
శుక్రవారం రాత్రి విజయవాడ నుంచివెళ్లే రైల్లో 650 మందిని పంపేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా.. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాని కారణంగా ఆగిపోయారు. నిరాశ చెందిన కార్మికులు.. నడిచి వెళ్లిపోతామని పట్టుబట్టారు. మంగళవారం లోపు అందరినీ పంపుతామని.. పోలీసులు హామీ ఇవ్వగా ఆందోళను విరమించారు.
ఇదీ చదవండి: