ETV Bharat / state

ఉపాధి హామీ బిల్లుపై సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

author img

By

Published : Dec 19, 2019, 9:19 AM IST

ఉపాధి హామీ బిల్లుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి 50కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Metting at sachivalyam on NREGS BILL
ఉపాధిహామీ బిల్లుపై సచివాలయంలో సమీక్ష

ఉపాధి హామీ బిల్లుపై 10 జిల్లాల అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. బిల్లుకు సంబంధించి విడుదల చేసిన నిధులు.. చేయాల్సిన నిధులపై చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి 50 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధిహామి కింద పనులు చేపట్టేందుకు 8 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటికే 2 వేలకోట్లకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.

రాష్ట్రానికి కేటాయించిన 6621.99 కోట్లలో ఇప్పటి వరకు 4423.09 కోట్ల రూపాయల పనులను చేపట్టట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల 146 గ్రామ సచివాలయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 5వేల 202 సచివాలయాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని.. ఇందుకోసం 1,582 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల 145 సీసీ మురుగు కాలువలను మంజూరు చేశామన్నారు. వీటిల్లో 190 కోట్ల రూపాయల విలువైన 1032 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.

రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి భూములను మెరక చేసుకునేందుకు 6,873 పనులకు అంచనా వేసినట్లు చెప్పారు. వీటిల్లో ఇప్పటికే 222 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద రాష్ట్రంలోని 6,010 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. ఉపాధి పనులకు స్థానికంగా లభించే ఇసుకను వినియోగించాలని మంత్రి స్పష్టంచేశారు. స్థానిక ఎంపీడీఓల ద్వారా ప్రతిపాదనల్ని ఏపీఎండీసీకి పంపాలని సూచించారు.

ఉపాధిహామీ బిల్లుపై సచివాలయంలో సమీక్ష

ఇదీ చూడండి

ట్రైబ్యునల్ తీర్పుపై మిస్త్రీ- టాటా స్పందన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.