రాష్ట్ర రాజధాని కోసం 225 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కనీస సానుభూతి లేకుండా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రైతులపై దాడులకు పాల్పడుతూ... అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని కోసం వరసగా 225 వ రోజు ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా.. విజయవాడలో నాట్లు వేస్తూ పూజలు నిర్వహించారు. రాజధానికి మద్దతు పలికినందుకే భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్న వదంతుల పై ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికే మూడు రాజధానుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గవర్నర్ వద్ద ఉన్న మూడు రాజధానుల బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని కోరుతున్నామని పద్మశ్రీ చెప్పారు. రైతులపై కనీస సానుభూతి లేదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: