కృష్ణా జిల్లా విజయవాడలోని ధర్నాచౌక్లో మీ సేవా ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా ఆపరేటర్లకు గ్రామ సచివాలయంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 11 వేల మంది మీసేవా నిర్వాహకులు ఉన్నారని... జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు. మీ సేవా నిర్వాహకులను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే మీసేవా నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాజధాని కోసం విజయవాడలో వాకర్స్ ర్యాలీ