బీఈడీ విద్యార్థులకు ప్రత్యేక బోధన
1987లోనే గణిత శాస్త్రంలోనూ ప్రయోగశాలలు ఉండాలని ప్రతిపాదించారని.. అయితే అవి ఇప్పటికీ ఆ దశలోనే ఉన్నాయంటున్నారు సత్యనారాయణ శర్మ. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ గణితం కార్యశాలలు నిర్వహిస్తూ.... విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు....గణితం పట్ల ఉన్న మక్కువ కారణంగా గణిత విజ్ఞానం, గణిత భారతం వంటి పుస్తకాలు కూడా రాశారు. అకాడమీ పుస్తకాలు రూపొందించడంలోనూ ఈ మాస్టారు పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా మారే బీఈడీ విద్యార్థులకు ఈ నమూనాల ద్వారా బోధిస్తూ....వారి ద్వారా మరికొంత మంది విద్యార్థులకు సులభతర గణితాన్ని చేరువచేయాలనేదే తన అభిలాషగా చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ మాస్టారు రూపొందించిన నమూనాలను అన్ని పాఠశాలల్లోనూ అందుబాటులోకి తెచ్చి వాటి ద్వారా బోధన చేస్తే..... భవిష్యత్తులో గణితం అంటే భూతం అనే భావన తొలగిపోయే అవకాశముంది.