ప్రముఖ కవి, దివిసీమ సాహితీ సమితి వ్యవస్దాపక కార్యదర్శి సనకా సుబ్బారావు మృతి పట్ల మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ సంతాపం తెలిపారు. దివిసీమ ఒక మంచికవిని కోల్పోయిందని అన్నారు. 'కవిశ్రీ' కలం పేరుతో ముత్యాల సరళిబాణీలో గేయ కవితలు రచించారని తెలిపారు.
సనకా సుబ్బారావు రాసిన ‘మండలి మన దివి బంగారం - తెలుగుజాతికొక మందారం’ అనే గీతం ప్రసిద్ది పొందింది. 1936లో కె.కొత్తపాలెంలో జన్మించిన ఆయన మోపిదేవి హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేసి రిటైరయ్యారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ సాహితీ స్దాపనలో ప్రముఖ పాత్ర వహించి కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణా జిల్లా రచయితల మహా సభల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారు.
ఇదీ చూడండి