కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పరిధిలోని పోలవరం కాల్వలో వ్యక్తి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాల్వకట్టపై ద్విచక్రవాహనం ఆపి కాల్వలో దూకినట్లు పోలీసులు వెల్లడించారు. కుమారుడిని ఒడ్డుపై ఉంచి రాజా కాల్వలో దూకి గల్లంతైనట్లు వివరించారు. నిమ్మకూరు రాజా.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడ్డాడని సమాచారం.
ముమ్మర గాలింపు చర్యలు..
బాధితుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.