ETV Bharat / state

వైకాపాకు వ్యతిరేకంగా ఇంటింటీ ప్రచారం చేస్తాం: మాల మహానాడు

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని పుర ఎన్నికల్లో మాలలకు వైకాపా టిక్కెట్లు కేటాయించలేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఫ్రాన్సిస్ రాజు మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో కార్పొరేటర్లుగా మాదిగ సామాజిక వర్గానికే ఇచ్చారని ఆయన ఆరోపించారు. 17 శాతం మాలలు ఉన్నా.. వైకాపా నిర్లక్ష్యంగా చూస్తోందని.. ఎన్నికల్లో వైకాపాకి వ్యతిరేకంగా ఓటు వేయమని మాలల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తామని ఆయన హెచ్చరించారు.

mala mahanadu ap president
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఫ్రాన్సిస్ రాజు
author img

By

Published : Feb 26, 2021, 7:52 PM IST

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా మాలలకు వైకాపా కనీసం ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాలల పట్ల వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఫ్రాన్సిస్ రాజు అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో కార్పొరేటర్లుగా మాదిగ సామాజిక వర్గానికే ఇచ్చారని ఆయన ఆరోపించారు.

విజయవాడ నగరంలో 17 శాతం మాలలు ఉన్నా.. వైకాపా నిర్లక్ష్యంగా చూస్తోందని నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపాకి వ్యతిరేకంగా ఓటు వేయమని మాలల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తామని ఆయన హెచ్చరించారు. మాలల్లో 95 శాతం వైకాపాకే ఓట్లు వేసి గెలిపించుకున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లు వేసి మాలల సత్తా చాటుతామన్నారు. ఆదివారం తమ కార్యాచరణపై రౌండ్ టేబులు సమావేశం నిర్వహిస్తామని ఫ్రాన్సిస్ రాజు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రసవత్తరంగా పురపాలిక పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.