కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. రైళ్లను రసాయనాలతో శుద్ది చేస్తున్నారు. ప్రయాణికులు కూర్చునే ప్రాంతాల్లో స్టీమ్ జనరేటర్‌తో శుభ్రం చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ప్రయాణికుణ్ని థర్మల్ ఇమేజర్తో తనిఖీ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఒకరికొకరు తాకకుండా మీటర్ దూరం నిల్చునేలా ఏర్పాట్లు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్టేషన్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. ప్రయాణికులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: