వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. నేడు తీవ్రవాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయుగుండం మంగళవారం సాయంత్రానికి బాలాసోర్‌కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం మధ్యాహ్నం బాలాసోర్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి