విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్న చేసింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయమే వీరిని ఈ దారుణానికి ఒడిగట్టేలా చేసింది. గన్నవరం మండలానికి చెందిన యువతి(28) గతంలో పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలుగా చేసింది. ఆ సమయంలో 3వ సంవత్సరం చదువుతున్న గుడివాడకు చెందిన విద్యార్థితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే యువకుడి కంటే యువతి 9 సంవత్సరాలు పెద్ద. ఈ కారణంతో ఇంట్లో వాళ్లు పెళ్లికి అంగీకరించరనే భయం వీరిని వెంటాడింది. ఈ క్రమంలోనే తాను గర్భం దాల్చినట్లు యువతి డైరీలో పేర్కొంది. మనోవేదనకు గురైన ఇద్దరూ విజయవాడలోని లాడ్జీలో ఆత్మహత్యాయత్నం చేశారు. యువతి ఘటనా స్థలంలోనే చనిపోగా... యువకుడు చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
వీరి ప్రేమ విషయం మాకు తెలియదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి