కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లు (మున్సిపాలిటీలకు చిరువ్యాపారులు, ప్రైవేటు వాహనదారులు కట్టే పన్ను) నిలిపివేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గూడ్స్ వాహనాలకు ఆశీలు వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ప్రైవేటు గుత్తేదారులు వసూలు చేస్తున్నారని ఆందోళన చేశారు.
స్థానిక లారీ అసోసియేషన్ కార్యాలయం నుంచి నగర పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం... పురపాలక కమిషనర్ జయరామ్, ఛైర్ పర్సన్ వరలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
తెలుగు అకాడమీలో సంస్కృత అకాడమీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిరసన..