ETV Bharat / state

చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు.. నేతల శుభాకాంక్షలు - chandrababu

తొలిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Sep 1, 2021, 9:43 PM IST

తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

అంగన్వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబుతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, అధికార ప్రతినిధులు పట్టాభి, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, ఏవీ రమణ, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

SAJJALA: ఈ నెలాఖరులో లేదా అక్టోబర్‌లో 'సీఎం రచ్చబండ': సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.